బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి బొనాంజా.. అదిరిపోయే ఆఫర్‌! | BSNL offers additional 3GB data on recharge plans | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి బొనాంజా.. అదిరిపోయే ఆఫర్‌!

Nov 5 2023 10:21 PM | Updated on Nov 5 2023 10:22 PM

BSNL offers additional 3GB data on recharge plans - Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రీచార్జ్‌ ప్లాన్‌లపై 3జీబీ అదనపు డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది.  అదనపు డేటా ఆఫర్‌ ప్రస్తుతం ఉన్న రూ. 251 రీఛార్జ్ ప్లాన్‌తోపాటు రూ. 400 లోపు ఉన్న ఇతర రీఛార్జ్ ప్లాన్‌లపైనా వర్తిస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ. 400 లోపు ప్రస్తుతం మూడు రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. అవి రూ. 251, రూ. 299  రూ. 398. దీపావళి బొనాంజాలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక డేటా ఆఫర్ గురించి ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా  పోస్ట్‌ల అధికారికంగా ప్రకటిచింది.

అదనపు డేటాను పొందండిలా..
బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక పోర్టల్‌తోపాటు సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే అదనపు డేటా ప్రయోజనం పొందవచ్చు. రూ. 251 రీచార్జ్‌పై అదనంగా 3జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. దీంతోపాటు ప్లాన్‌లో భాగంగా 70జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ. 299 ప్లాన్‌పైనా 3జీబీ ఉచిత డేటాను ప్రకటించింది. ఈ ప్లాన్ ఇప్పటికే రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  

ఇక రూ. 398 రీచార్జ్‌ ప్లాన్‌కు కూడా 3జీబీ అదనపు డేటా వర్తిస్తుంది. ఈ ప్లాన్‌పై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఎస్‌టీడీ, లోకల్ వాయిస్ కాలింగ్‌తో పాటు 120 జీబీ డేటా వస్తుంది.  30 రోజులు చెల్లుబాటు ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌ కేర్‌ యాప్ గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement