రోజుకు రూ.10లోపే.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్! | BSNL Rs 299 Plan Data and Validity Details Here | Sakshi
Sakshi News home page

రోజుకు రూ.10లోపే.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్!

Aug 31 2026 7:48 PM | Updated on Aug 31 2026 8:06 PM

BSNL Rs 299 Plan Data and Validity Details Here

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 299 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 3 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుకు రోజుకు రూ.10 కంటే (రూ.9.96) తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి ఇది మంచి ఆప్షన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement