సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు! | Apple Leadership Shakeup, Tim Cook Steps Down As Apple CEO, Who Is John Ternus And What Changes Are Coming From September | Sakshi
Sakshi News home page

సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు!

Aug 31 2026 4:08 PM | Updated on Aug 31 2026 4:47 PM

Tim Cook Steps Down as Apple CEO And Who is John Ternus What Changes are Coming

యాపిల్‌లో చాలా ఏళ్ల తర్వాత కీలకమైన నాయకత్వ మార్పు జరగబోతోంది. 2011 నుంచి కంపెనీ సీఈఓగా ఉన్న టిమ్ కుక్ సెప్టెంబర్ 1 నుంచి సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త సీఈఓగా యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు.

టిమ్ కుక్‌ తరువాత బాధ్యతలు
సీఈఓగా రోజువారీ వ్యవహారాల నుంచి టిమ్ కుక్ తప్పుకున్నప్పటికీ.. యాపిల్‌లో ఆయన పాత్ర పూర్తిగా ముగియదు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం, వైట్ హౌస్, చైనా ప్రభుత్వంతో కంపెనీకి ఉన్న సంబంధాల విషయంలో ఆయన కీలకంగా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్ వాణిజ్య విధానాలు, ప్రభుత్వ నిబంధనలు, సరఫరా వ్యవస్థ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కుక్ అనుభవం కంపెనీకి తప్పకుండా ఉపయోగపడుతుంది.

ఎవరీ జాన్ టెర్నస్?
జాన్ టెర్నస్ గత 20 ఏళ్లకు పైగా యాపిల్‌లో పనిచేస్తున్నారు. 2021 నుంచి హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఐఫోన్ సహా యాపిల్‌కు చెందిన పలు కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. టిమ్ కుక్ కూడా టెర్నస్‌ను మంచి ఇంజినీర్, ఆలోచనాపరుడిగా ప్రశంసించారు. అందుకే.. ఆయన నియామకంతో యాపిల్‌లో ప్రొడక్ట్ డిజైన్, హార్డ్‌వేర్, కొత్త ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

టెర్నస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. యాపిల్ ఉత్పత్తుల డిజైన్‌లో కొన్ని పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్ ముందున్న సవాళ్లు.. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సప్లై చైన్ సమస్యలు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ. వీటిని ఎదుర్కొంటూనే కంపెనీ కొత్త ఉత్పత్తులు, కొత్త డిజైన్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: జొమాటో కీలక నిర్ణయం.. ఆ వంటకాలపై నిషేధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement