
ఆదివారం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో 'నరేంద్ర మోదీ' మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ మొదలైనవారు పాల్గొన్నారు.
దేశాధినేతలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, భవిష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను భవిష్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు. అయితే జాతీయ జెండాలను క్యాప్సన్‌గా పెట్టారు. పోస్ట్‌లో రాష్ట్రపతి భవన్‌ని చూపిస్తూ మూడు చిత్రాలను పంచుకున్నాడు.
🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/0yrflT9DHs
— Bhavish Aggarwal (@bhash) June 9, 2024