
సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్‌వర్క్ (ఎస్‌డీఎఫ్) కింద 2023–24 ఏడాదికి గాను భారతి సిమెంట్ సున్నపు గనికి వరుసగా ఆరో ఏడాది కేంద్ర గనుల శాఖ నుంచి 5 స్టార్ రేటింగ్ దక్కింది.
జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ సీఎంవో ఎం సాయి రమేశ్, హెడ్ (మైన్స్) కె. సుధాకర్ పురస్కార పత్రాలను అందుకున్నారు.