
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో ‘గోగో’ను విడుదల చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్ , వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి బాబుల్ రెడ్డి కలిసి గోగోను ఆవిష్కరించారు.
బజాజ్ గోగోను P5009, P5012, P7012 మూడు వేరియంట్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
వేరియంట్‌ను అనుసరించి గోగోలో 9.2 కిలోవాట్ నుంచి 12.1 కిలోవాట్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 251 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది.
ఇది నాలుగు గంటలలోపు 80% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?
గోగోలో మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, పవర్, క్లైంబ్, పార్క్ అసిస్ట్ వంటి మోడ్‌లున్నట్లు కంపెనీ తెలిపింది. విభిన్న డ్రైవింగ్ అవసరాలకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.
డ్రైవర్ సౌలభ్యం కోసం డిజిటల్ డిస్ ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్, స్టోరేజ్ స్పేస్ ఉంటుందని చెప్పింది.
రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లు, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో వివిధ రోడ్డు పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.