తగ్గుతున్న ఆటో డీలర్ల ఆదాయం!.. రిపోర్ట్ | Auto Dealers Revenue Growth Slow Down This Year | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ఆటో డీలర్ల ఆదాయం!.. రిపోర్ట్

Sep 1 2024 7:39 PM | Updated on Sep 1 2024 7:40 PM

Auto Dealers Revenue Growth Slow Down This Year

ఆటోమొబైల్ రంగంలో దేశం దూసుకెళ్తోంది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో డీలర్ల ఆదాయ వృద్ధి గణనీయంగా తగ్గుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ నివేదికలు చెబుతున్నాయి.

గత ఏడాది 14 శాతంగా ఉన్న ఆదాయ వృద్ధి.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా. దీనికి కారణం ధరల పెరుగుదల అని తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గడం వల్ల డీలర్లు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ప్రకటించారు. దీంతో ఆదాయం కొంత తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావంలో ఎక్కువ భాగం తయారీదారులచే భరించబడినప్పటికీ, ఆటో డీలర్ల లాభదాయకతను కూడా 3 శాతానికి తగ్గిస్తుందని నివేదికలో వెల్లడైంది.

పండుగల సీజన్‌లో అధిక తగ్గింపుల మధ్య విక్రయాలు పుంజుకోవడంతో ద్వితీయార్ధంలో కూడా ఇన్వెంటరీ కాస్త తగ్గుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. క్రిసిల్ రేటింగ్స్.. 110 మంది ఆటో డీలర్ల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను వెల్లడించింది.

నిజానికి భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement