
ఆర్‌బీఐ సూత్రప్రాయ ఆమోదం
యూనివర్సల్ బ్యాంకు (పూర్తి స్థాయి బ్యాంకు)గా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్‌బీఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా 2024 సెపె్టంబర్ 3న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హత ప్రమాణాలు పరిశీలించిన ఆర్‌బీఐ తాజాగా దీన్ని మంజూరు చేసింది. దీంతో ఆర్‌బీఐ నుంచి పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా అవతరించింది.
ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!
బ్యాంకు ఎండీ సీఈవో సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘యూనివర్సల్ బ్యాంక్‌గా కార్యకపాలు నిర్వహించుకునేందుకు ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా చరిత్ర సృష్టించాం. వ్యాపార విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం’ అన్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఆర్‌బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. అంతక్రితం 2014 ఏప్రిల్‌లో బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్)లకు ఆర్‌బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది.