
బ్యాంకులు తమ వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్లను ప్రకటించాయి. అందులో కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే వారి నుంచి పర్సనల్ లోన్లు తీసుకునే వారి వరకు బ్యాంకును అనుసరించి చాలా ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వడ్డీ రేట్ల తగ్గింపులు కూడా ఉన్నాయి. ఏయే బ్యాంకులు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయో తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కార్డులు, రుణాలు, పేజాప్, ఈజీ ఈఎంఐల్లో 10,000 కంటే ఎక్కువ ఆఫర్లను ప్రకటించింది. 9.99% వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు, 72 నెలల వరకు కాలపరిమితి, జీరో ఫోర్‌క్లోజర్ ఫీజు (రుణ మొత్తం రూ. 15 లక్షలకు పైన, కస్టమర్ సిబిల్ స్కోర్ 730 కంటే ఎక్కువ ఉంటే)ను ఆఫర్ చేస్తుంది. అక్టోబర్ చివరి వరకు 7.4% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లను ప్రకటించింది.
ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ & సీఈఓ శశిధర్ జగదీషన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రుణ వృద్ధిని వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయం’ అన్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్
గృహ రుణాలు: ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000.
ఆటో రుణాలు: ప్రాసెసింగ్ ఫీజు రూ.999.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు: ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6,000 తక్షణ క్యాష్‌బ్యాక్.
ఎల్‌జీ, హైయర్, పానాసోనిక్, బ్లూస్టార్, జేబీఎల్ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల వస్తువుల కొనుగోలుపై రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు.
బ్యాంక్ ఆఫ్ బరోడా
గృహ రుణాలు: సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో 7.45% నుంచి ప్రత్యేక వడ్డీ రేట్లు.
మహిళా రుణగ్రహీతలకు, జన్ జీ(2000 తర్వాత పుట్టినవారు), మిలీనియల్స్ (40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు)కు వడ్డీ రేటులో రాయితీలు ఇస్తోంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి రుణ ఉత్పత్తులన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపు.
వ్యక్తిగత రుణాలు: 10.49% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, రూ.50 లక్షల వరకు రుణ మొత్తాలు, 84 నెలల వరకు కాలపరిమితి ఆఫర్ చేస్తుంది.
దీర్ఘకాలిక గృహ రుణాలు: రూ.10 కోట్ల వరకు రుణ మొత్తాలకు రూ.10,000 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పొడిగించిన కాలపరిమితులు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్లన్లు ఉంటాయి.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే..