
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (ముకేశ్ అంబానీకి చెందిన) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి (2025–26లో క్యూ2) రూ. 695 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్స రం ఇదే త్రైమాసికంలో లాభం రూ. 689 కోట్లతో పోల్చితే 0.9% పెరిగింది.
క్యూ2లో మొత్తం ఆదాయం రూ.981 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 694 కోట్లు గా ఉంది. అంటే ఆదా యం 40% వృద్ధి చెందింది. వడ్డీ ఆదా యం దాదాపు రెట్టింపు రూ.392 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.205 కోట్లుగానే ఉంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఫర్వాలేదు
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (2025–26 క్యూ2) రూ.561 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.571 కోట్లతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గింది. ఆదాయం ఇదే కాలంలో 9 శాతం వృద్ధితో రూ.2,857 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా వ్యయాలు 11 శాతం ఎగసి రూ.1,647 కోట్లకు చేరడం లాభాలపై ప్రభావం చూపించింది.
వసూలు కాని మొండి రుణాలకు (ఎన్‌పీఏలు) చేసిన కేటాయింపులు 29 శాతం పెరిగి రూ.481 కోట్లుగా ఉన్నాయి. క్యూ2లో డిపాజిట్లు 21 శాతం పరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. సంజయ్ అగర్వాల్‌ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల కాలానికి కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. వాటాదారులు, ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే 2026 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు ఎండీ, సీఈవోగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.