భారత్‌ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ | Asian Development Bank raises India GDP growth forecast | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ

Apr 12 2024 4:49 AM | Updated on Apr 12 2024 11:37 AM

Asian Development Bank raises India GDP growth forecast - Sakshi

6.7 శాతం నుంచి 7 శాతానికి అప్‌  

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్‌ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది.  ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్‌ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్‌ ఎడిషన్‌ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్‌ ఇంజిన్‌’’గా భారత్‌ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్‌బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement