ఐఫోన్‌14.. యాపిల్‌ బంపర్‌ ఆఫర్‌!

Apple Store Offer On Iphone 14 - Sakshi

తక్కువ ధరకు యాపిల్‌ ఐఫోన్‌ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్‌ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్‌. ఐఫోన్‌ 14ను ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14ప్రో మ్యాక్స్‌లతో యాపిల్‌ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. 

యాపిల్‌ స్టోర్‌ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్‌ 14పై మాత్రం భారీ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్‌ ఎక్సేంజ్‌, రెండోది బ్యాంక్‌ ఆఫర్‌. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్‌14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి...

అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్‌ స్టోర్‌లో ఐఫోన్‌ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్‌ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్‌లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్‌ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్‌ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్‌ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి.

(ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్‌.. త్వరలో భారత్‌ రోడ్ల పైకి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top