
వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో 'యాపిల్' (Apple) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు.. ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేయలేదు. మొదటిసారి ఈ రకమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ దీనిని 2026లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ధర కూడా 2000 డాలర్లు (రూ. 1.73 లక్షలు) ఉండొచ్చని సమాచారం.
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ గురించి యాపిల్ కంపెనీ అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఒకవేళా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ నిజమైతే.. ఇదే మార్కెట్లో అత్యంత ఖరీదైనదిగా మారనుంది. ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే యాపిల్.. ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేస్తుందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. యాపిల్ కంపెనీ మాత్రం సైలెంట్‌గా ఉంది. కాగా త్వరలోనే ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి వాటితో తరవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో పేస్ ఐడీ ఫీచర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. టచ్ ఐడీ ఫీచర్ అనేది సైడ్ బటన్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఫోల్డబుల్ ఐఫోన్లో 5.5 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.8 ఇంచెస్ మెయిన్ ఫోల్డింగ్ డిస్ప్లే వంటివి పొందవచ్చని సమాచారం. ఈ ఫోన్ వెనుక డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. ఇప్పటివరకు లీకైన ఫీచర్స్ అద్భుతంగానే ఉన్నాయని తెలుస్తోంది. కానీ దీని పనితీరు గురించి తెలుసుకోవాలంటే.. లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment