మస్క్‌‌ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు!

Apple Disney And Other Companies Pause Advertising On X - Sakshi

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎప్పుడు ఏమి చేసినా సంచలనమే.. దీని వల్ల అప్పుడప్పుడు కొన్ని విపరీతాలు కూడా జరుగుతాయి. ఇటీవల ఆయన చేసిన ఒక తప్పిదం మీద అమెరికా విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. దీంతో అమెరికా కంపెనీలైన యాపిల్, డిస్నీ వంటివి ఎక్స్‌లో యాడ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

యుద్ధ సమయంలో ఎక్స్‌లో వచ్చిన ఒక పోస్టుకు మస్క్ స్పందించిన విధానం అమెరికన్లకు నచ్చలేదు, ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. దీంతో దిగ్గజ కంపెనీలు ఎక్స్‌లో యాడ్స్ నిలిపివేయడానికి సిద్ధమయ్యాయి.

కేవలం యాపిల్, డిస్నీ మాత్రమే కాకుండా.. ఐబీఎం, ఒరాకిల్, లయన్స్‌ గేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్పొరేషన్‌, వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ, పారామౌంట్‌ గ్లోబల్‌, బ్రావో టెలివిజన్‌ నెట్‌వర్క్‌, కామ్‌కాస్ట్‌ మొదలైన కంపెనీలు తమ యాడ్స్ నిలిపివేయాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

అమెరికన్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం మస్క్‌‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న కంపెనీ మరింత కిందికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నారు. ఇదంతా మస్క్ చేసిన ఓ తప్పిదం వల్లే అని పలువులు నెటిజన్లు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top