మరోసారి అంతర్జాతీయ ప్రశంసలందుకున్న ఏపీ ప్రభుత్వం | Andhra Pradesh Government Navaratnalu Has Received International Acclaim - Sakshi
Sakshi News home page

మరోసారి అంతర్జాతీయ ప్రశంసలందుకున్న ఏపీ ప్రభుత్వం

Published Tue, Oct 3 2023 12:42 PM

AP Govt Navaratnalu Has Received International Acclaim - Sakshi

‘నవరత్నాలు’లో భాగమైన పెదలందరికి ఇల్లు పథకం కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న దృఢమైన అంకితభావానికి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. హౌసింగ్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో లబ్ధిదారులకు ఎనర్జీ ఎఫిషియెన్సీ స్టార్-రేటెడ్ ఉపకరణాలను అందించడానికి చర్యలు తీసుకుంది. దీని ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, గణనీయమైన ఇంధన వనరుల పరిరక్షణకు హామీ ఇస్తుంది.

ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ప్రభుత్వ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కౌన్సెలర్ జోనాథన్ డెమెంగే, దక్షిణ భారతదేశం.. కేంద్ర పాలిత ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి & ప్రభుత్వ వ్యవహారాల కోసం ఈఈఎస్ఎల్ సలహాదారు ఎ చంద్రశేఖర్ రెడ్డికి పంపిన కమ్యూనికేషన్‌లో ఈఈఎస్ఎల్ అండ్ గృహనిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఆకట్టుకునేలా అమలు చేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం! ఎలా?

ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచడం, దాని ప్రభావాన్ని గురించి అర్థమయ్యేలా వివరించడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా పరిష్కరించడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు చాలా అవసరం అని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ధర ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!

డెమెంగే ప్రశంసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకి దక్కిన ఖ్యాతి అని చెప్పాలి. హౌసింగ్ పథకాలలో ఎనర్జీ ఎఫిషియెన్సీ చర్యలను ప్రవేశపెట్టేందుకు హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ & ఈఈఎస్ఎల్ సీఈఓ విశాల్ కపూర్‌లు చేసిన ప్రయత్నాలను కూడా ఆయన అభినందించారు.

Advertisement
 
Advertisement