డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో జనరేట్ అయ్యే డేటాను ఇక్కడి సర్వర్ల ద్వారానే ప్రాసెసింగ్ చేయడాన్ని ప్రారంభించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. క్లాడ్ ఓపస్ 5, సోనెట్ 5, హైకూ 4.5 తదితర ఏఐ మోడల్స్‌కి దీన్ని వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది.
దీని ప్రకారం క్లాడ్ ఏఐలో వచ్చే క్వెరీలను భారత్‌లోని సర్వర్లలోనే కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. తమ కస్టమర్ల అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంథ్రోపిక్ ఎండీ (ఇండియా) ఇరీనా ఘోష్ పేర్కొన్నారు. భారత్‌లో విస్తరించే క్రమంలో కొన్నాళ్ల క్రితమే సంస్థ బెంగళూరులో కార్యాలయం ప్రారంభించింది.


