
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) 2025లో భాగంగా 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా టైర్ 2, 3 నగరాల భాగస్వామ్యం బలంగా ఉందని చెప్పింది. బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు ఈ ఫెస్టివల్ సీజన్‌లో రూ.1000 కోట్లకు పైగా ఆదా అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 22 నుంచి నెలరోజుల పాటు జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో ఇంకా కొన్ని రోజులు మిగిలున్న నేపథ్యంలో ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025కు 276 కోట్లకు పైగా కస్టమర్ల సందర్శనలు నమోదయ్యాయి.
మొత్తం కస్టమర్లలో 70% మందికి పైగా టైర్ 2, 3 నగరాల నుంచే ఉన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రా, హరిద్వార్, ముజఫర్‌పూర్, జామ్‌నగర్ వంటి ప్రాంతాల విక్రేతలు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశారు.
బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు రూ.1000 కోట్లకు పైగా ఆదా అయింది.
జీఎస్టీ బచత్‌ఉత్సవ్‌లో భాగంగా విక్రేతలు వందల కోట్ల జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించారు.
కొత్తగా చేరిన అమెజాన్ ప్రైమ్ సభ్యుల్లో 70% మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.
ప్రైమ్ సభ్యులకు వేగవంతమైన డెలివరీలు అందాయి.
గత ఏడాదితో పోలిస్తే 60% అధికంగా ‘సేమ్-డే డెలివరీలు’ (1.4 కోట్లు) జరిగాయి.
టైర్ 2, 3 నగరాల్లో రెండు రోజుల్లో డెలివరీలు 37% పెరిగాయి.
B2B మార్కెట్‌లో కొత్త బిజినెస్ కస్టమర్ సైన్-అప్‌లు 30% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.
బల్క్ ఆర్డర్లు దాదాపు 120% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.
కార్పొరేట్ గిఫ్టింగ్ 60% (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది.
చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMBs) భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.
అమెజాన్ బజార్ (అల్ట్రా-అఫర్డబుల్ ప్రొడక్ట్స్ స్టోర్)లో విక్రేతల భాగస్వామ్యం 2 రెట్లు పెరిగింది.
ప్రతి నలుగురు కస్టమర్లలో ఒకరు అమెజాన్ పే ఉపయోగించారు.
ప్రతి 4 ఆర్డర్లలో ఒకటి యూపీఐ ద్వారా పూర్తయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధి నమోదు చేసింది.
మొబైల్స్, గృహోపకరణాల కొనుగోళ్లలో ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి ఈఎంఐ ద్వారా జరిగింది. వీరిలో ఐదులో నాలుగు కొనుగోళ్లు నో కాస్ట్ ఇఎంఐ ద్వారానే జరిగాయి.
రూ.30,000 పైబడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు 30% వృద్ధి చెందాయి.
ఫ్యాషన్, బ్యూటీ విభాగం 95% వరకు వృద్ధిని నమోదు చేసింది. ల్యాబ్-గ్రోన్ డైమండ్ జువెలరీ 390% (y-o-y) వృద్ధి చెందింది.
కొరియన్ బ్యూటీ ఉత్పత్తులు 75% పెరిగాయి.
ద్విచక్ర వాహనాల అమ్మకాలు 105% (y-o-y) పెరిగాయి. సగటున 6 రోజుల్లోనే డెలివరీ అందించారు.
అమెజాన్ ఫ్రెష్ టైర్ 2, 3 నగరాల నుంచి 60% వృద్ధిని నమోదు చేసింది. పండుగ సమయంలో టీని అధిగమించి కాఫీ 30% వృద్ధిని సాధించింది.
ఫెస్టివ్ లైట్లు, అలంకరణ వస్తువుల అమ్మకాలు 500% పెరిగాయి.
ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..‘రికార్డు స్థాయిలో 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 మరోసారి కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన, ఆదరణ పొందిన ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా అమెజాన్ నిలిచింది’ అన్నారు.
ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు