వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్ | Amazon Plans Layoffs And Know The TCS Cognizant Companies Have Handed Pink Slips To Employees in 2025 | Sakshi
Sakshi News home page

వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్

Oct 16 2025 9:09 AM | Updated on Oct 16 2025 9:31 AM

Amazon Plans Layoffs And Know The TCS Cognizant Companies Have Handed Pink Slips To Employees in 2025

2025 ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు.. తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా చేరింది. సంస్థ దాదాపు 15 శాతం ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు.. ఫార్చ్యూన్ తన నివేదికలో వెల్లడించింది.

అమెజాన్ కంపెనీ.. తొలగించనున్న ఉద్యోగులలో పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ టీమ్ (PTX) అని పిలువబడే హెచ్ఆర్ విభాగం నుంచి ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. కాగా ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగుల తొలగింపు ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో.. ప్రపంచ వ్యాప్తంగా 10,000 మందికంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడుల మధ్య తన ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. కంపెనీ సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐటీ ఉద్యోగుల తొలగింపులు
ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో.. కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి & ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): టీసీఎస్ కంపెనీ రెండు సార్లు సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 2 శాతం అని తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలు, ఏఐ విస్తరణల మధ్యసంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల తొలగింపు చేపట్టింది.

విప్రో: విప్రో విషయంలో.. తొలగింపులకు సంబంధించిన అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, టెక్ రంగంలో దాని వ్యయ సామర్థ్యం, ఉత్పాదకతను మెరుగుపరచడానికి 24,516 ఉద్యోగాలను తగ్గించిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.

మైక్రోసాఫ్ట్ కంపెనీ సుమారు 40% కంటే ఎక్కువ లేదా దాదాపు 4,000 ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. గూగుల్ (100 మంది), యాక్సెంచర్ (ప్రపంచ వ్యాప్తంగా 11000 మంది), సేల్స్‌ఫోర్స్ (సుమారు 4000 మంది), ఐబీఎమ్ (1000 మంది), కాగ్నిజెంట్ (3500 మంది) వంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించాయి.

ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ యూఎస్ వ్యాపారం నుంచి ఒత్తిడి & పెరిగిన H-1B వీసా రుసుము వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని కంపెనీలు మానవ శ్రామిక శక్తి కంటే ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచడానికి ఇష్టపడే కృత్రిమ మేధస్సు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడానికి సుముఖత చూపుతున్నాయి.

ఇదీ చదవండి: మరోమారు స్పెషల్ ఆఫర్: రూ. 1తో నెల రోజులు ఫ్రీ!

Advertisement
 
Advertisement
Advertisement