సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల కార్యాలయ వీడియోలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆఫీస్‌లో ఉచిత భోజనం, రకరకాల స్నాక్స్, జిమ్, ఇతర సౌకర్యాలను ఆస్వాదిస్తున్న ఉద్యోగుల వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, తాజాగా మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (VEO) వార్తలు వెలువడటంతో ఈ పాత వీడియోలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇన్ని సౌకర్యాలున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందంటూ కొందరు నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.
కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి టెక్నాలజీ దిగ్గజాల ఉద్యోగులు తమ రోజువారీ ఆఫీస్ జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ‘మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ జీవితంలో ఒక రోజు’.. ‘మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో నేను ఏం తింటానంటే..’ ఇలా రకరకాల క్యాప్షన్లతో పోస్ట్ చేసిన వీడియోల్లో ఉద్యోగులు వివిధ రకాల భోజనాలు, స్నాక్స్‌తో పాటు ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నారు. ఈ వీడియోలు కార్పొరేట్ ఉద్యోగుల జీవనశైలిపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇటీవల మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్ (VEO) గురించి వార్తలు రావడంతో ఈ వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. భారత్‌తో పాటు మరో మూడు దేశాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులకు వాలంటీరీ ఎగ్జిట్ వర్తించవచ్చన్న నివేదికలు చర్చకు దారితీశాయి. దీంతో గతంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా తమను పరిచయం చేసుకున్న వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్‌ను పలువురు నెటిజన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ ఫుడ్, ఇతర కార్యాలయ ప్రోత్సాహకాలను చూపించే వీడియోలపై ఎక్స్ (ట్విటర్) వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.
Microsoft employee's day: ☕ Coffee 🥞 Breakfast 🍫 Snacks 🍦 Dessert 🎯 Carrom 🍉 More snacks 💻 Some work in between Meanwhile Microsoft: offering buyouts to 60,000 people 😂 Would you take this job or the buyout? 👇 https://t.co/hOWqVYKhCK
— Jitendra Vaswani 📊SEO Expert, AI & Marketing (@JitendraBlogger) October 27, 2026
day in life of a Microsoft engineer my entire feed is full of such videos https://t.co/0BP4Mjei4z
— Asmit (@coolcoder56) October 27, 2026
The new flex showing you they stole your job, don’t really work and eat slop all day. https://t.co/TLxdq1V38r
— SoCal Brief (@patriotocnow) October 25, 2026


