వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ చుట్టూ ముళ్ల కంచెలు | High Tension In Pulivendula: Barbed Wire Fences Around The Ysrcp Office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ చుట్టూ ముళ్ల కంచెలు

Oct 18 2026 7:58 AM | Updated on Oct 18 2026 8:11 AM

High Tension In Pulivendula: Barbed Wire Fences Around The Ysrcp Office

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో పోలీసుల దాష్టీకం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ చుట్టూ ముళ్ల కంచెలు వేసిన పోలీసులు.. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని టీడీపీ, పోలీసులు, ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 

పులివెందుల నియోజక వర్గం నుంచి వైసీపీ కార్యకర్తలు పులివెందుల టౌన్‌కి వస్తే కేసులు పెడతాయంటూ పోలీసులు భయపెడుతున్నారు. నిన్న(శనివారం) పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే. నిన్న దాడికి సంబంధించి పులివెందుల డీఎస్పీ, టీడీపీ నేత బిటెక్ రవి అర్థరాత్రి రహస్య సమావేశమైనట్లు సమాచారం.

వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులకు పెట్టాలని డీఎస్పీకి  టీడీపీ నేత బీటెక్ రవి సూచించినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గుండాలను తరలిస్తున్నారని.. పోలీసులే టీడీపీ గూండాలకు రక్షణ కల్పిస్తున్నారని.. పోలీసుల చొరవతోనే టీడీపీ గూండాలు పులివెందులకు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement