మరోమారు స్పెషల్ ఆఫర్: రూ. 1తో నెల రోజులు ఫ్రీ! | BSNL Diwali Offer Only Rs 1 With One Month Free 4g | Sakshi
Sakshi News home page

మరోమారు స్పెషల్ ఆఫర్: రూ. 1తో నెల రోజులు ఫ్రీ!

Oct 16 2025 7:49 AM | Updated on Oct 16 2025 9:45 AM

BSNL Diwali Offer Only Rs 1 With One Month Free 4g

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు నెల రోజుల పాటు దివాలీ బొనాంజా ప్లాన్‌ పేరిట ఉచిత 4జీ సర్వీసుల ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం నామమాత్రంగా రూ. 1 మాత్రమే చార్జీ ఉంటుంది. అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 వరకు నెల రోజులపాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ఆఫర్‌ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్, రోజుకు 2జీబీ హైస్పీడ్‌ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత సిమ్‌ లభిస్తాయి. తమ సర్వీసుల నాణ్యత, కవరేజీని కస్టమర్లు స్వయంగా పరీక్షించి, తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ ఎ. రాబర్ట్‌ జే రవి తెలిపారు. ఆగస్టులో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇదే తరహా ఆఫర్‌ను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement