
హైదరాబాద్: భారత్, ఐరోపా మధ్య గ్రీన్ ఎనర్జీ సరఫరా గొలుసు నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏఎం గ్రీన్, పోర్ట్ ఆఫ్ రోటర్‌డామ్ అథారిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్రీన్ ఇంధనాల బంకరింగ్, సస్టైనబుల్ ఏవియేషన్ ఇంధనాల (SAF) సరఫరా, రోటర్‌డామ్‌లో టెర్మినల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
సంవత్సరానికి 10 లక్షల టన్నుల గ్రీన్ ఇంధనాల ఎగుమతి, సుమారు 1 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధ్యం చేసే ఈ సహకారం, భారతదేశ నెట్ జీరో లక్ష్యాలు, ఐరోపా డీకార్బనైజేషన్ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఏఎం గ్రీన్ 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం, 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. కాకినాడలో తొలి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
రోటర్‌డామ్ పోర్ట్, ఐరోపాలో 13శాతం ఇంధన డిమాండ్‌ను నిర్వహిస్తూ, హైడ్రోజన్ హబ్‌గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగస్వామ్యం గ్లోబల్ కార్బన్-రహిత శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఏఎం గ్రీన్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలసెట్టి, రోటర్‌డామ్ సీఈఓ బౌడెవిజన్ సీమన్స్ తెలిపారు.