రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్‌టెల్‌.. కారణం ఇదే | Airtel Paid Rs 15,519 Crore Spectrum Dues | Sakshi
Sakshi News home page

రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్‌టెల్‌.. కారణం ఇదే

Dec 18 2021 10:45 AM | Updated on Dec 18 2021 10:47 AM

Airtel Paid Rs 15,519 Crore Spectrum Dues - Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ గతంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించిన బాకీ మొత్తాన్ని ముందస్తుగా, పూర్తిగా చెల్లించేసింది. రూ. 15,519 కోట్లు ప్రభుత్వానికి కట్టినట్లు సంస్థ వెల్లడించింది. దీనితో కనీసం రూ. 3,400 కోట్ల మేర వడ్డీ వ్యయాల భారం తగ్గినట్లవుతుందని పేర్కొంది. 2014లో నిర్వహించిన వేలంలో ఎయిర్‌టెల్‌ రూ. 19,051 కోట్లకు 128.4 మెగాహెట్జ్‌ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది.

స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు సంబంధించి 2026–27 నుంచి 2031–32 వరకూ 10 శాతం వడ్డీ రేటుతో వార్షికంగా వాయిదాల్లో చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే, ముందుగానే కట్టేయడం వల్ల ఆ మేరకు వడ్డీ భారం తగ్గినట్లవుతుంది. మూలధనాన్ని సమర్ధమంతంగా ఉపయోగించుకోవడంపై మరింత దృష్టి పెట్ట డం కొనసాగిస్తామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement