‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో | Airasia Ceo Gets Massage During Management Meeting | Sakshi
Sakshi News home page

‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన ఎయిర్‌ ఏసియా కంపెనీ సీఈవో

Oct 17 2023 5:06 PM | Updated on Oct 17 2023 5:46 PM

Airasia Ceo Gets Massage During Management Meeting - Sakshi

ఎయిర్‌ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ వివాదంలో చిక్కుకున్నారు. తమ కంపెనీ వర్క్‌ కల్చర్‌పై గొప్పలు చెప్పారు. ఆపై అబాసు పాలయ్యారు? బాడీ మసాజ్‌ చేయించుకునే సమయంలో కూడా మేనేజ్‌మెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుందంటూ ఓ ఫోటోను షేర్‌ చేశారు.

ఆ ఫోటోలో ఫెర్నాండేజ్‌ షర్ట్‌ లేకుండా ఓ వైపు మసాజ్‌ చేయించుకుంటూ మరోవైపు ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం మనం చూడొచ్చు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకుంటున్నాని క్యాప్షన్‌ ఇచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు.

ఆఫోటోపై నెటిజన్స్ మండి పడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలాంటి చర్యల వల్ల ఎయిర్‌ ఏసియా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. వెంటనే ఫెర్నాండేజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తుంటే.. సంస్థ గొప్పతనం గురించి ఇలా వివరించడం సరైంది కాదని అంటున్నారు.

మొత్తానికి ఈ ఫోటోలు ఏవియేషన్‌ విభాగంలో కాక రేపుతుండగా.. ఈ ఫోటోలు ఫెర్నాండెజ్‌ షేర్‌ చేశారా? లేదంటే ఈజీ మనీ కోసం సైబర్‌ నేరస్తులు ఇలా ఫోటోల్ని మార్ఫింగ్‌ చేసి లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారా? అని తెలియాల్సి ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement