అంతర్జాతీయ విస్తరణలో ఎయిర్ ఇండియా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం

Air India Deal With Alaska Airlines Details - Sakshi

దేశీయ దిగ్గజం 'టాటా' యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) 'అలాస్కా ఎయిర్‌లైన్స్‌'తో ఇంటర్‌లైన్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ ఇండియా న్యూయార్క్ JFK, నెవార్క్-న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్ గేట్‌వేల నుంచి అమెరికా, మెక్సికో, కెనడాలోని 32 గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ద్వైపాక్షిక ఇంటర్‌లైనింగ్‌ ద్వారా రెండు విమానయాన సంస్థలు ఒక నెట్‌వర్క్‌లో టిక్కెట్‌లను విక్రయించనున్నాయి. అంతే కాకుండా రెండు ఎయిర్‌లైన్స్ స్పెషల్ ప్రోరేట్ ఒప్పందాన్ని కూడా నమోదు చేసుకోవడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్ కవర్ చేసే మార్గాలలో ఎయిర్ ఇండియాను అనుమతిస్తుందని ఎయిర్‌లైన్ ప్రతినిధి వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్‌.. విర‌క్తితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఇప్పుడు ల‌క్ష‌ కోట్ల కంపెనీకి బాస్

ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ 'నిపున్ అగర్వాల్' మాట్లాడుతూ.. అలాస్కా ఎయిర్‌తో ఏర్పరచుకున్న ఒప్పందం అమెరికా, కెనడాలో విస్తృత సేవలను అందించడానికి మాత్రమే కాకుండా.. నెట్‌వర్క్ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top