ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్! | Aadhaar Free Update Last Date And How To Apply For This | Sakshi
Sakshi News home page

ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!

Dec 13 2024 4:46 PM | Updated on Dec 13 2024 6:25 PM

Aadhaar Free Update Last Date And How To Apply For This

మైఆధార్ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా.. ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 'డిసెంబర్ 14' చివరి రోజుగా ప్రకటిస్తూ 'యూఐడీఏఐ' (UIDAI) వెల్లడించింది. అయితే పేర్కొన్న గడువు సమీపిస్తోంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అయితే ఈ డేట్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? అనేది రేపు తెలుస్తుంది.

యూఐడీఏఐ వెల్లడించిన గడువు (డిసెంబర్ 14) లోపల ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్‌ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా?
● మైఆధార్ పోర్టల్‌ ఓపెన్ చేయండి
● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయాలి.
● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.
● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement