వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్‌ బజాజ్‌ | 1,000 More Branches In Next Two To Three Years: Sanjiv Bajaj | Sakshi
Sakshi News home page

వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్‌ బజాజ్‌

Sep 12 2023 7:06 AM | Updated on Sep 12 2023 11:34 AM

1000 More Branches in Next Two Years Sanjiv Bajaj - Sakshi

ముంబై: బజాజ్‌ ఫైనాన్స్‌ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌ తెలిపారు. 

బజాజ్‌ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్‌లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్‌ ఫైనాన్స్‌లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్‌ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. 

ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్‌ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు.  రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement