సంక్రాంతికి గోదావరి జలాలు | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి గోదావరి జలాలు

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దమ్మపేట: మండల పరిధిలోని నాగుపల్లి సీతారామ కాలువ పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే సంక్రాంతి నాటికి శ్రీరాంపురం చెరువులోకి గోదావరి జలాలను విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నివాసంలో నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

నూతన ఎకై ్సజ్‌

ఎస్‌ఐలకు పోస్టింగ్‌

ఖమ్మంక్రైం: గ్రూప్‌–2 ద్వారా ఎంపికై ఎకై ్సజ్‌ ఎస్సైలుగా శిక్షణ పూర్తిచేసుకున్న 11మందిని ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. వీరికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో పోస్టింగ్‌ ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు కారేపల్లి ఎస్‌ఐగా పృధ్వీరాజు, మధిర ఎస్‌ఐగా టి.సందీప్‌, సత్తుపల్లికి కె.సురేష్‌, ఇల్లెందుకు జె.వేణు, డి.నాగఅమృత, పాల్వంచ ఎస్‌ఐలుగా ఉపేందర్‌, సీహెచ్‌.నవీన్‌, భద్రాచలం ఎస్‌ఐగా బి.రమేష్‌నాయక్‌, అశ్వరావుపేటకు ఎన్‌.ధనలక్ష్మి, కె.విజయ్‌తో పాటు మణుగూరు ఎస్‌ఐగా లక్ష్మణ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు.

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళాలు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తికి చెందిన రాజు దంపతులు రూ.1,00,101 అందించారు. అలాగే, హైదరాబాద్‌ కూకట్‌పల్లి వసంతనగర్‌ వాసి రామాంజనేయరెడ్డి రూ.1,00,116ను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం స్వామిని దర్శించుకుని పూజలు చేయగా, ఆలయ అధికారులు జ్ఞాపికలతో సన్మానించారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు, ఉద్యోగి లింగాల సాయిబాబా పాల్గొన్నారు.

నేడు

ప్రత్యేక లోక్‌ అదాలత్‌

కొత్తగూడెంఅర్బన్‌: చెక్‌ బౌన్స్‌ కేసులకు సంబంధించి శనివారం ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జి.ప్రేమలత, కార్యదర్శి ఎం.రాజేందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెక్‌ బౌన్స్‌ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని వివరించారు.

23న ఈత పోటీలకు

ఎంపికలు

కొత్తగూడెంఅర్బన్‌: ఈ నెల 23న ఉమ్మడి జిల్లాస్థాయి ఈత పోటీల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హనుమంతరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రంపూర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని, ఈ ఎంపికలకు 2008 నుంచి 2015 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని వెల్లడించారు. ఎంపికై నవారిని ఈ నెల 28, 29 తేదీల్లో సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు.

జమలాపురంలో

సామూహిక వ్రతాలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా శుక్రవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఇందులో 57 మంది దంపతులు పాల్గొనగా, ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ వ్రతం చేయించారు. అలాగే, సాయంత్రం ఆలయంలో కోనేరు వద్ద కార్తీక దీపోత్సవం, గంగా హారతి నిర్వహించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement