పెద్దమ్మతల్లి హుండీ కానుకల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లి హుండీ కానుకల లెక్కింపు

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

110 రోజులకు

రూ.29.28 లక్షల ఆదాయం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. ఎండోమెంట్‌ కొత్తగూడెం డివిజన్‌ పరిశీలకుడు కె.ఆనంద్‌, ఈఓ ఎ.విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. గత జూలై 30వ తేదీ నుంచి నేటి వరకు 110 రోజుల హుండీ కానుకలను లెక్కించగా రూ.29,28,083 ఆదాయం లభించింది. అమెరికా డాలర్‌ నోట్‌, అరబ్‌ ఎమిరేట్స్‌ ధీరమ్‌ కూడా లభించాయి. మిశ్రమ బంగారం 38.595 గ్రాములు, వెండి 907.546 గ్రాములు లభించగా, సీజ్‌ చేసి తిరిగి హుండీలో వేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బి.అనిత, వైశ్య బ్యాంక్‌ మేనేజర్‌, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

పెద్దమ్మతల్లి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానికి కొత్తగూడెం విద్యానగర్‌ కాలనీకి చెందిన అమ్మవారి భక్తులు నామని సత్యనారాయణ, మల్లీశ్వరి దంపతుల కుమార్తె శరణ్య రూ.1,00,116 విరాళం అందజేశారు. దాతలకు ఈఓ అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందించారు.

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తొలుత అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్‌కు పంచామృతం అభిషేకంతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement