పడిపోతున్న భూగర్భ జలాలు | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న భూగర్భ జలాలు

Nov 21 2026 12:32 AM | Updated on Nov 21 2026 12:32 AM

● జిల్లాలో సరాసరి భూగర్భ జల మట్టం 7.94 మీటర్లుగా నమోదు ● గత సంవత్సరంతో పోలిస్తే 2.67 మీటర్ల లోతుకు.. ● కొత్తగూడెంలో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

● జిల్లాలో సరాసరి భూగర్భ జల మట్టం 7.94 మీటర్లుగా నమోదు ● గత సంవత్సరంతో పోలిస్తే 2.67 మీటర్ల లోతుకు.. ● కొత్తగూడెంలో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో నేపథ్యంలో వర్షాల్లేక జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 1086.2 మి.మీ గాను 888 మి.మీ నమోదైంది. 18 శాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో జిల్లా సరాసరి భూగర్భ జలమట్టం 7.94 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.30 మీటర్ల లోతుకు పడిపోయింది. గత నెలలో భూగర్భ జలాలు 8.47 మీటర్ల లోతులో ఉండగా, ఇటీవల వచ్చిన మురసు తుపాన్‌తో 0.53 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకివచ్చాయి. కాగా మే నెల వరకు జిల్లా సరాసరి భూగర్భజల నీటిమట్టం 10.42 మీటర్లుగా నమోదైంది. చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో 0.28 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండగా, దమ్మపేట మండలం మందలపల్లిలో గరిష్టంగా 41.98 మీటర్ల లోతుకు పడిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో 1.19 మీటర్లలోనే నీరు లభిస్తుండగా, కొత్తగూడెంలో 34.30 మీటర్ల లోతుకు తగ్గి పాతాళానికి పడిపోయినట్లయింది.

11 మండలాల్లో లోటు వర్షపాతం

ఇక ఆళ్లపల్లి, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దమ్మపేట, దుమ్ముగూడెం, గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాక 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 10 మండలాలు అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, జూలూరుపాడు, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్‌, టేకులపల్లి, ఇల్లెందులలో సాధారణ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement