● ఎన్బీ వారెంట్ల జారీలో నిర్లక్ష్యం వద్దు ● నేర సమీక్షలో ఎస్పీ రోహిత్‌రాజ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పెండింగ్ కేసుల దర్యాప్తు వేగంగా చేపడుతూ నిందితులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశించారు. కొత్తగూడెంలో మంగళవారం జరిగిన నెలవారీ నేర సమీక్ష సమాశంలో ఆయన పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టు సంబంధిత అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ప్రతీ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేయాలని, తద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యం చేయొద్దని, నాన్ బెయిలబుల్ వారెంట్ల జారీలో వేగం పెంచాలని సూచించారు. అంతేకాక గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గంజాయితో ఎదురయ్యే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భరోసా కేంద్రం, షీ–టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, డీసీఆర్బీ, భద్రాచలం డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్‌కుమార్, రవీందర్‌రెడ్డి, వెంకన్నబాబు, మల్లయ్యస్వామి, అరుణ్‌కుమార్‌తో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
పోలీసు ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీసు శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా ఆధ్వర్యాన శిక్షణ ఇస్తున్నారు. ఈమేరకు అభ్యర్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్ అందించగా, ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉద్యోగాలు సాధించొచ్చని తెలిపారు. ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటూ, అధ్యాపకులు సూచనలు పాటిస్తూ ఉద్యోగాలు పొందాలని పేర్కొన్నారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ ఈ.శ్రీనివాస్, ఆర్ఐలు బి.రవి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


