డిసెంబర్‌ నెలాఖరులోగా రీసర్వే | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ నెలాఖరులోగా రీసర్వే

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

మణుగూరు టౌన్‌: మణుగూరు మున్సిపాలిటీ పరిధి చినరావిగూడెంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను డిసెంబర్‌ నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వేను మంగళవారం పరిశీలించిన ఆయన అటవీ భూముల సరిహద్దులు, భూముల విస్తీర్ణం, సర్వే పురోగతిపై సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1,395 ఎకరాల్లో అటవీశాఖ రికార్డుల ప్రకారం 554 ఎకరాలు అటవీ భూమి ఉందని వారు తెలిపారు. ఈమేరకు వేగంగా సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని 70 గ్రామాలతో పాటు నక్షాలు లేని ఏడు గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భూముల రికార్డులు, సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా రీసర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. కాగా, పట్టాపాస్‌ పుస్తకాలు ఉన్నా అటవీశాఖ నుంచి వస్తున్న అభ్యంతరాలపై పలువురు గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆతర్వాత ఆయన గ్రామస్తులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ఆరా తీశారు. వీధి దీపాలపై పలువురు ఫిర్యాదు చేయడంతో తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, తహసీల్దార్‌ నరేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌, హౌసింగ్‌ ఏఈ పావని పాల్గొన్నారు.

పశుసంపద సంరక్షణకు కార్యాచరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ, కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ పశుసంపద సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. కరువు పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత, తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈమేరకు పశుపోషణపై ఆధారపడిన రైతులు వీబీజీ రామ్‌జీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలు, దరఖాస్తుల కోసం ఎంపీడీఓ, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

రాయిగూడెం కాలనీలో పరిశీలించిన

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement