తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

కేంద్ర, రాష్ట్రాల బృందాల సర్వేతో నష్టం అంచనాలు

ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో నేపథ్యాన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యాన అన్నదాతలు, ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణను తక్షణమే కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. సీపీఐ, రైతుసంఘం సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కరువు పరిస్థితులు మొదలుకాగా, రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశముందన్నారు. ఈమేరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి సమగ్రంగా గుర్తించాలని కోరారు. ఎలాంటి సర్వే చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.25 వేల కోట్లు అడగడం అశాసీ్త్రయమని, క్షేత్రస్థాయిలో నష్టం అంతకంటే ఎక్కువగానే ఉన్నందున కేంద్ర, రాష్ట్ర బృందాలు పర్యటించి శాసీ్త్రయంగా నష్టాన్ని లెక్కించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక రాష్ట్రంలో కేవలం 364 మండలాలనే కాక తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి పంట వేయని రైతులతో పాటు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కే.సాబీర్‌ పాషా 16 మండలాలనే కాకుండా టేకులపల్లి, పాల్వంచ, భద్రాచలం, జూలూరుపాడు, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చాలని కోరారు. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మేయర్‌ మూడ్‌ గణేష్‌, నాయకులు నరాటి ప్రసాద్‌, సలిగంటి శ్రీనివాస్‌, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, ఎస్‌.డీ.సలీం, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వి.పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement