మండలంలోని గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల గోదావరిలో వరద పెరగడంతో పనులకు ఆటంకం ఏర్పడగా, మళ్లీ రెండు రోజుల నుంచి జోరందుకున్నాయి. ప్రస్తుతం ఇసుక బస్తాలతో మూడో లేయర్ వేస్తున్నారు. సుమారు 200 మంది కార్మికులు పడవల సాయంతో ఇసుక బస్తాలు తీసుకెళ్లి కట్టపై పేరుస్తున్నారు. ఆనకట్ట ఎత్తు ఒక మీటర్ పెంచడం ద్వారా కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేస్తే.. వేసవిలో మూడు జిల్లాలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి కొరత ఏర్పడదని చెబుతున్నారు. ఈమేరకు రూ.కోటి వ్యయంతో చేపడుతున్న పనులు పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. – అశ్వాపురం


