ఆకట్టుకున్న సైన్స్‌ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సైన్స్‌ కాంగ్రెస్‌

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

కొత్తగూడెంఅర్బన్‌: నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లాస్థాయి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొత్తగూడెం ఆనందఖని ప్రాంతంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు 107 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు. వాటిలో ఉత్తమంగా ఉన్న ఆరు ప్రాజెక్ట్‌లను అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. వినూత్న శాసీ్త్రయ ప్రదర్శనలకు 107 పాఠశాలల నుంచి 240 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరిశోధనా నైపుణ్యాలను, వినూత్న ఆలోచనలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.శంభూ ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. కాగా డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు సుమలత, సంధ్యారాణి, నాగమణి ప్రసన్న పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా సైన్స్‌ అధికారి బి. సంపత్‌ కుమార్‌, ఏఎంఓ మాధవరావు, కె. పరమయ్య, గైడ్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

బూర్గంపాడు: వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి శంభూప్రసాద్‌ ఉపాధ్యాయులకు సూచించారు. బూర్గంపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులఅభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యే తరగతులు బోధించాలన్నారు. ఎంఈఓ యదుసింహరాజు, హెచ్‌ఎం రవీలాదేవి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

ఆరు ప్రాజెక్ట్‌ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement