సరిహద్దు అడవిలో పులి సంచారం | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు అడవిలో పులి సంచారం

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

అశ్వారావుపేటరూరల్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో మరోసారి పెద్దపులి సంచరిస్తోంది. గత రెండు రోజులుగా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల, గుబ్బల మంగమ్మ ఆలయ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామంలో బ్రహ్మయ్య అనే రైతుకు చెందిన ఓ ఆవు, రెండు దూడలను హతమార్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి గుండ్లమడుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు. గతంలో పులికి ఏపీ అటవీ శాఖ అధికారులు ట్రాకర్‌ అమర్చారని, ట్రాకర్‌ ద్వారా వస్తున్న సిగ్నల్స్‌ ఆధారంగా ఏపీ సరిహద్దులోనే సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్టు రేంజర్‌ మురళీకృష్ణ తెలిపారు. సరిహద్దు ప్రాంతాలు కావడంతో చుట్టు పక్కల గిరిజన గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఏపీ వైపు నుంచి తెలంగాణ సరిహద్దుల్లో రెండు రోజులు సంచరించింది. పెద్దపులి సమీప అటవీ ప్రాంతాల్లోనే సంచరించడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement