ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ఆమోదం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ఆమోదం

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

మణుగూరు టౌన్‌: మణుగూరు ఓపెన్‌కాస్ట్‌ విస్తరణ ప్రభావిత ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం మంజూరుకు ఆమోదం లభించింది. కలెక్టర్‌ అంకిత్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో రూ.8.19 కోట్ల పరిహారం చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మణుగూరుకు చెందిన 71 కుటుంబాల్లోని 149 మంది లబ్ధిదారులకు రూ.5.50లక్షల చొప్పున పరిహారం అందనుంది. అర్హులైన కుటుంబాలకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిహారం అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలంఐటీడీఏ పీఓ రాహుల్‌ పాల్గొన్నారు.

మణుగూరు ఓసీ ప్రభావిత

లబ్ధిదారులకు రూ.8.19 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement