ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

కొత్తగూడెంఅర్బన్‌: గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చిన్నారులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఇల్లెందు జేబీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, మరో వర్గం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు ఏ.సాంబ, జె.గణేష్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు కొత్తగూడెంలో మంగళవారం వారు డీఈఓ శంభుప్రసాద్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఉపాధ్యాయుడి తీరుతో పాఠశాలలో విద్యార్థినుల జీవితం ప్రశ్నార్థకంగా మారినందున ఆలస్యం చేయకుండా విధుల నుంచి తొలగించాలని కోరారు. అంతేకాక సదరు ఉపాధ్యాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయుల మధ్య కులాల వైరుధ్యం ఉన్నట్లు చిత్రీకరిస్తున్న అంశంపై దృష్టి సారించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement