పాల్వంచరూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకు ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సురేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం కాలనీకి చెందిన కోడిగుడ్ల వ్యా పారం చేసుకుంటూ జీవనంసాగిస్తున్న బానోతు రాము(35)కు అదే గ్రామానికి చెందిన శైలాజతో వివా హం జరిగింది. దంపతులకు ఇద్దరుకుమారులు. కుటుంబ కలహాల కారణంగా భార్య పదినెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతుడి వద్ద ఇద్దరి పేర్లు రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించిందనే ప్రచారంపై ఎస్‌ఐని వివరణకోరగా.. సూసైడ్‌నోటు దొరకలేదని తెలిపారు.
గడ్డి మందు తాగి ఒకరు..
భద్రాచలంటౌన్: మద్యం తాగేందుకు కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం అశోక్‌నగర్ కొత్తకాలనీకి చెందిన బట్టు వెంకట్రావు (40) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 2న మద్యం మత్తులో గడ్డి మందు తాగి కుటుంబీకులకు చెప్పడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


