పంటల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంటల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

ఉదయం రెక్కీ... రాత్రి చోరీ

జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు

జూలూరుపాడు(సుజాతనగర్‌): తుపాన్‌ ప్రభా వంతో దెబ్బతిన్న పంటల సంరక్షణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. సుజాతనగర్‌ మండలం వేపలగడ్డలో మురసు తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దెబ్బతిన పంటల్లో వ్యవసాయశాఖ అధికారుల సలహా మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1,600 ఎకరాల్లో మినుము పంట, 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని, ఇంకా వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. కొత్తగూడెం ఏడీఏ సుధాకర్‌, సుజాతనగర్‌ ఎంఏఓ నర్మద పాల్గొన్నారు.

ఉపాధి వనరుగా మలుచుకోవాలి

ఇల్లెందురూరల్‌: వర్మీ కంపోస్టు తయారీ, మేకల పెంపకంపై ఐటీడీఏ ద్వారా పొందిన శిక్షణను ఉపాధి వనరుగా మలచుకోవాలని వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏఎస్‌సీఐ) ప్రతినిధులు సతీష్‌పాండే, రీతురాజ్‌ పురుషోత్తం సూచించారు. ఇల్లెందు వైటీసీ పర్యవేక్షణలో మండలంలోని పూబెల్లి గ్రామంలో సేంద్రియ ఎరువుల తయారీ, టేకులపల్లి మండలం రోళ్ళపాడు గ్రామంలో మేకల పెంపకం శిక్షణ తరగతులను బుధవారం పరిశీలించారు. సేంద్రియ ఎరువు తయారీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేకల పెంపకంలో మెళకువలు, వాటికి వచ్చే వ్యాధులు, నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై రైతులతో చర్చించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై అవగాహన పెంపొందించుకుంటే ప్రత్యామ్నాయ ఉపాధి వనరుగా ఉంటాయని పేర్కొన్నారు. వైటీసీ ఇన్‌చార్జి అనసూర్య, శిక్షకురాలు కీర్తన, పూబెల్లి సర్పంచ్‌ సాయమ్మ, కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌ జిల్లా ముఠా అరెస్ట్‌

ఖమ్మం క్రైం: తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేందుకు పొద్దంతా కారులో తిరుగుతూ రెక్కీ నిర్వహించడం.. ఎంపిక చేసుకున్న ఇళ్లలో రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా ముఠా ను ఖమ్మం సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఐదు నెలలుగా ఈ ముఠా ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చోరీకి పాల్ప డినట్లు గుర్తించారు. ఈ మేరకు అడిషనల్‌ డీసీపీ రామానుజం బుధవారం వివరాలు తెలిపారు. ఖమ్మంకు చెందిన చల్లా వెంకటేశ్వర్లు, పాయన నవీన్‌, వాజేడుకు చెందిన వేములవాడ జీవనప్రకాష్‌ కలిసి విలాసవంతమైన జీవి తానికి అలవాటు పడి చోరీలు మొదలు పెట్టారు. ఖమ్మం జిల్లాలోని వైరా, ఏన్కూరు, కల్లూరు, కారేపల్లితో పాటు మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడగా కేసులు నమోదు నమోదయ్యాయి. ఈమేరకు సీపీఎస్‌ ఏసీపీ సర్వర్‌, సీఐలు రాజ్‌కుమార్‌ గౌడ్‌, వంశీకృష్ణ నిఘా వేయగా వారం క్రితం ఇద్దరు పట్టుబడ్డారు. ఈ బృందం నాయకుడు వెంకటేశ్వర్లును బుధవారం అరెస్ట్‌ చేయగా, ఒక కారు, యాభై గ్రాముల బంగారం, 400గ్రాముల వెండిం స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ సీఐ, ఎస్సైలతో పాటు ఉద్యోగులు వేణు, ఓంప్రకాష్‌, హరికృష్ణ, సుధీర్‌, నరసింహారావు, మంగిత్యా, జానీ, శ్రీధర్‌, సతీష్‌, సుందరం, నర్సింహారావును ఆయన అభినందించారు.

ఐరన్‌ స్క్రాప్‌

దొంగల పట్టివేత

మణుగూరు టౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–4 అంతర్గత ఓబీ డంప్‌ వద్ద ఇనుప సామగ్రి చోరీకి పాల్పడి ఐరన్‌ను ఎత్తుకెళ్తున్న దొంగలను సెక్యూరిటీ సిబ్బంది బుధవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. మున్సిపాలిటీలోని శేషగిరినగర్‌కి చెందిన ఇద్దరు మహిళలను, గాంధీనగర్‌కి చెందిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించినట్లు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement