11 మందిని కాపాడిన ఎస్డీఆర్‌ఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

11 మందిని కాపాడిన ఎస్డీఆర్‌ఎఫ్‌

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

దమ్మపేట: మండల పరిధిలో కురుస్తున్న వర్షాలకు మల్లెపూల వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో బుధవారం పొలం పనులకు వెళ్లిన 11 మంది గ్రామస్తులు వేర్వేరు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నారు. వీరిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన వీరప్రోలునాగమణి(43) గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి ఆకస్మికంగా వచ్చిన వరద ఉధృతికి వాగులో చిక్కుకుపోయింది. పొలం గట్టుపై ఉన్న ఓ చెట్టును ఆశ్రయించి అక్కడే ఆగిపోయింది. విషయాన్ని గ్రామస్తులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో అక్కడకు చేరుకున్న రెస్క్యూ బృందం, బోటు ద్వారా వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.

మరో ఘటనలో..

మండలంలోని తొట్టిపంపు గ్రామ శివారు గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో వ్యవసాయ పనుల కోసం వచ్చిన అదే గ్రామానికి చెందిన పది మంది వ్యక్తులు వరద నీరు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో చిక్కుకుపోయారు. వారు నిలబడిఉన్న రహదారి ఎత్తుగా ఉండటంతో క్షేమంగా ఉన్నప్పటికీ, ఎటువైపు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించారు. బోట్లలో వారి వద్దకు చేరుకుని పది మందిని సురక్షితంగా బయటకు తరలించారు. సహాయక చర్యలను తహసీల్దార్‌(ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌) మద్దినేని మురళి పర్యవేక్షించారు.

ములకలపల్లిలో..

ములకలపల్లి: మండలంలోని మూకమామిడి గ్రామానికి చెందిన మిర్యాల మధు, మరో ఇద్దరు రైతులతో బుధవారం పాతమూకమాడి సమీపంలోని పంట చేలోకి వెళ్లాడు. మోటారు తొలగించి తిరిగి ఇంటికి బయలుదేశారు. మార్గమధ్యలోకి వచ్చిన మధు తోటలో పవర్‌ స్ప్రేయర్‌ ఉందంటూ మళ్లీ చేలోకి వెళ్లాడు. ఆ సమయంలో వాగు గమనం మార్చుకుని రెండోపాయగా చీలిపోయి, మధు పత్తి చేను గుండా ప్రవహించింది. దీంతో రెండు ప్రవా హాల నడుమ చిక్కుకున్న మధు, చెట్టు ఎక్కి సహా యం కోసం అభ్యర్థించాడు. తోటి రైతుల సమాచారంతో ఎస్సై మధుప్రసాద్‌ డీడీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో అక్కడకు చేరుకున్నారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఐదు గంటలపాటు రెస్క్యూ నిర్వహించారు. డ్రోన్‌ సాయంతో సహాయక చర్యలుచేపట్టారు. సాయంత్రానికి మధు ను క్షేమంగా వాగు దాటించి తీసుకొచ్చారు. సర్పంచ్‌ ఆదిలక్ష్మి, పాల్వంచ సీఐ సతీష్‌, తహసీల్దార్‌ స్వాతిబిందు సహాయక చర్యలను పర్యవేక్షించారు.

వేర్వేరు ప్రాంతాల్లో రక్షణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement