భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత పోలీస్ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనం సమావేశ మందిరంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ పరీక్షల శిక్షణా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అభ్యర్థులతో కూర్చొని ఫ్యాకల్టీ బోధనాపద్ధతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అభ్యర్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, ఏసీఎంఓ రమేష్, కేర్ టేకర్ సర్వేశ్వర్ దొర, వార్డెన్ మోహన్, పీడీలు వసంతం, పార్వతి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


