మణుగూరురూరల్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు యంత్రాల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్‌వీ సూర్యనారాయణ సూచించారు. సోమవారం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఏరియాలో రోజుకు 40వేల టన్నుల బొగ్గు ఉత్పతి సాధించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావ నేపథ్యంలో విద్యుత్, బొగ్గు విని యోగం పెరుగుతున్నందున డిమాండ్‌కు అనుగుణంగా షావెల్స్, ఇతర యంత్రాల పని గంటలను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉత్పత్తి పెంచాలన్నారు. అనంతరం ఓసీ–4 గనిలోని బొగ్గు బెంచ్‌ను సందర్శించి ఉత్పత్తి పనులను పరిశీలించారు. అధికారులు ఎలీషా, బి.రవి, డి.వెంకటరామారావు, వి.మధన్‌నాయక్, శ్రీని వాసచారి, సీహెచ్ రాంబాబు, పి.రామకృష్ణ, ఎల్.దయాకర్, నాగరమేష్, రమణారెడ్డి, సర్వర్ నబీ పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్
ఎస్‌ఐ సస్పెండ్
పేకాట ఏజెంట్లతో కుమ్మక్కే కారణం
ఖమ్మంక్రైం: ఖమ్మం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సురేష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మంలో పేకాట స్థావరాల ఏజెంట్లతో ఆయన కుమ్మక్కయ్యాడనే ఆరోపణలతో కొన్నాళ్ల క్రితం సురేష్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. విచారణ అనంతరం ఆరోపణ లు నిజమేనని రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లైంగిక దాడి కేసులో
ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
ఖమ్మంలీగల్/మధిర: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కాగా నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్(పోక్సో) కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణఅర్జున్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ 28న మధిర ఎస్సీ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను గడ్డాల అరవింద్ అలియాస్ చిన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. ఈమేరకు మరుసటి రోజు అరవింద్‌పై పోక్సో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఆయనపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసును అప్పటి వైరా ఏసీపీ ఎం.ఏ.రహమాన్ దర్యాప్తు చేయగా, ప్రాసికూషన్ తరఫున ఏపీపీ జె.శరత్‌కుమార్‌రెడ్డి వాదించారు. విచారణలో మధిర టౌన్ సీఐ దోమల రమేష్, ఉద్యోగులు ఎం.ఉమారాణి, వై.నాగేశ్వరావు, శ్రీకాంత్, ఆర్.నాగేశ్వరావు, అయూబ్ సహకరించారు.
వేర్వేరు ప్రాంతాల్లో
ఇద్దరు మహిళల అదృశ్యం
ఖమ్మంఅర్బన్: వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు కానరాకుండా పోయిన ఘటనలపై ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. పాతఖానాపురానికి చెందిన 30 ఏళ్ల మహిళ గతనెల 25న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అలాగే, ఖమ్మం గొల్లగూడెంకు చెందిన 20ఏళ్ల మహిళ సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో వారి ఫిర్యాదు చేయగా ఇంకో కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనం చోరీ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో ఉన్న గోదావరి ఫంక్షన్ హాల్ వద్ద ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన తోట ధనుంజయ రామ్ గత నెల 5న తెల్లవారుజామున ఫంక్షన్ హాల్ వద్ద బైక్ పార్క్ చేశాడు. ఉదయం చూసేసరికి వాహనం కనిపించలేదు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐసతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


