ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం, రఘునాథపాలెం మండలాల నాయకులతో సోమవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ఓటర్ల జాబితాతో పాటు ఆతర్వాత పట్టభద్రులైన వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయిస్తూ, పార్టీ యాప్‌లో కూడా ఓటర్ల వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నాయకులు నేరుగా పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని చెప్పారు. కాగా, రాష్ట్రంలో కరువు ప్రకృతి తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో ఏర్పడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలకు ఈ విషయాన్ని వివరిస్తూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పువ్వాడ సూచించారు. ఈసమావేశాల్లో నాయకులు బచ్చు విజయ్‌కుమార్, నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, కూరాకుల వలరాజు, కొనకంచి ప్రసాద్, వల్లభనేని రామారావు, వీరూనాయక్, మద్దినేని వెంకటరమణ, గుత్తా రవి, హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, లక్ష్మణ్‌నాయక్, యాస రామారావు, పెంట్యా, శంకర్, పొట్టపల్ల రాజా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల సమావేశంలో
మాజీ మంత్రి పువ్వాడ


