దేశానికి స్వాతంత్య్ర వచ్చి 79ఏళ్లు పూర్తయింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన సాగుతున్న వేళ సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలు కూడా మారుతున్నాయి. ఇన్నేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొదలు సొంతింటి కల, కుటుంబ, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయనే భావన ఉన్నా ఇంకా అవకాశాలు పెరగాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. అంతేకాక యువతలో దేశభక్తి పెరగాలని కూడా భావిస్తున్నారు. ఈమేరకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ వర్గాల వారిని ‘సాక్షి’ ఆధ్వర్యాన సర్వే చేయగా వారి ఆశలు, ఆకాంక్షలను వెల్లడించారు. – సాక్షి నెట్‌వర్క్


