పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రావణ శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరా జనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు.
కోయ భాషలో
‘స్వాతంత్య్ర’ పిలుపు
భద్రాచలంటౌన్: ఈసారి స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్వహించబోయే ఉత్సవాల కోసం కోయ భాషలో ప్రత్యేక ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఈ వినూత్న పత్రికలను రాష్ట్ర మంత్రులు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్లు, ఏజెన్సీ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులకు పంపిణీ చేసినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేందుకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఇల్లెందు నుంచి
మియాపూర్‌కు ఆర్టీసీ సర్వీస్
వయా మహబూబాబాద్,
తొర్రూరు, భువనగిరి
ఇల్లెందు: ఇల్లెందు బస్ డిపో నుంచి బయ్యారం, మహబూబాబాద్, తొర్రూర్, తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరి, ఉప్పల్, జేబీఎస్, కూకట్‌పల్లి మీదుగా మియాపూర్‌కు నూతన సూపర్ లగ్జరీ బస్ ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం ఆర్‌ఎం సరిరాం తెలిపారు. ఈ నెల 16 నుంచి సర్వీస్ మొదలవుతుందన్నారు. ఇల్లెందులో సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి రాత్రి 11.50 గంటలకు మియాపూర్ చేరుతుందన్నారు. తిరిగి మియాపూర్ నుంచి ఉదయం 7 గంటలకు బయలే దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఇల్లెందుకు చేరుకుంటుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ. 510, పిల్లలకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
సింగరేణిలో 16మంది ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
రుద్రంపూర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సింగరేణి యాజమాన్యం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల నుంచి ఉత్తమ ఉద్యోగులు, అధికారులను ఎంపిక చేసింది. వీరిని కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో శనివారం సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి సన్మానించనున్నారు. మొత్తం 16మంది ఎంపిక చేయగా, వీరిలో కొత్తగూడెం రీజియన్ నుంచి ఏడుగురు ఉన్నా రు. ఇందులో పి.మధుసూదన్‌రావు(పీకేఓసీ–2, మణుగూరు ఏరియా), జీ.ఏ.శ్రీనివాసరావు(కోయగూడెం ఓసీ, ఇల్లెందు ఏరియా), జక్కుల గట్టయ్య(ఆర్‌సీహెచ్‌పీ, కొత్తగూడెం ఏరియా), కె.శ్రీధర్(జేవీఆర్ ఓసీ సత్తుపల్లి ఏరి యా), సీహెచ్.సూర్యనారాయణశర్మ(ఇంటర్న ల్ ఆడిట్, కార్పొరేట్ ఏరియా), అధికారుల విభాగంలో ఏ.మనోహర్(జీఎం, కార్పొరేట్ ఏరియా), ఎన్.చక్రవర్తి(జీఎం, కార్పొరేట్ ఏరి యా) ఎంపికయ్యారు. వీరితో పాటు ఇతర ఏరి యాల నుంచి సామకృష్ణ, ఆశిష్‌కుమార్ సాహు, జీడుల రాజ్‌కుమార్, జి.రాజు, కె.సుధాకర్, గజ్జల రాజయ్య, ఎం.మల్లేష్, ఎస్.సదానందం, మేరుగు రాజ్‌కుమార్ ఉన్నారు. కాగా, సింగరేణిలో 50 విభాగాలు ఉండగా, కేవలం 12 విభాగాల నుంచే ఉత్తమ కార్మికులు, ఉద్యోగులను ఎంపిక చేయడాన్ని పలువు రు తప్పుపడుతున్నారు.


