సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి
రుద్రంపూర్: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ సత్తా చాటుతోందని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి వెల్లడించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయ భవనంపై ఏర్పాటుచేసిన 1.23 మెగావాట్ల రూప్‌టాప్ సోలార్ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి సంస్థ ఇప్పటికీ 245 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. సంస్థకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలతో పాటు కార్యాలయ భవనాలపై ప్లాంట్ల ఏర్పాటుతో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పోస్టులు 878..
దరఖాస్తులు 4,060
పాల్వంచరూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న 878 అంగన్‌వాడీ ఆయా పోస్టులకు 4,060 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా శుక్రవారం తెలిపారు. అశ్వారావుపేటలో 43 పోస్టులకు 206 దరఖాస్తులు, బుర్గంపాడులో 67 పోస్టులకు 439, చండ్రుగొండలో 89 పోస్టులకు 475, చర్లలో 54 పోస్టులకు 203, దమ్మపేటలో 133 పోస్టులకు 628, దుమ్ముగూడెంలో 105 పోస్టులకు 486, కొత్తగూడెంలో 36 పోస్టులకు 102, మణుగూరులో 71 పోస్టులకు 399, పాల్వంచలో 68 పోస్టులకు 268, టేకులపల్లిలో 132 పోస్టులకు 547, ఇల్లెందులో 80 పోస్టులకు 307 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.


