జూలూరుపాడు: స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఆరోగ్య జీవన యాత్ర సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం జూలూరుపాడులో 1200 మీటర్లు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. యాత్ర సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని చేబూని నినాదులు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్ నుంచి సాయిబాబా ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. చండ్రుగొండ క్రాస్ రోడ్, డాక్టర్ అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్మించారు. జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి తదితరులు మాట్లాడారు. కాగా, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్, జిల్లా అధ్యక్షుడు నరుకుల వెంకటేశ్వర్లు, నాయకులు ఆపద రామారావు, మాదినేని సతీష్, చింతనిప్పు రామారావు, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.


