జోర్‌దారిగా గంజాయి! | - | Sakshi
Sakshi News home page

జోర్‌దారిగా గంజాయి!

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

తగ్గింది కానీ ఆగలేదు

హైదరాబాద్‌, ముంబై వంటి

నగరాలకు తరలింపు

పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిఘా వ్యవస్థలు నిరంతరం పని చేస్తున్నా జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గతేడాదితో పోల్చితే కేసుల సంఖ్య తక్కువగా నమోదైనా గంజాయి రవాణాను నిరోధించలేకపోయారు.

గంజాయి అడ్డా ఏఓబీ

జిల్లాకు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి. సమీపంలోనే ఒడిశా రాష్ట్రం కూడా ఉంది. సీలేరు నదికి ఇరువైపులా వ్యాపించిన ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండ ప్రాంతాలను కేంద్రాలుగా ఏఓబీలో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. క్రమంగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్‌ జిల్లాలకు విస్తరిస్తోంది. ఏఓబీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోకి ప్రవేశించగానే మూడు జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏఓబీ లో పండించే గంజాయిని హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాను డ్రగ్‌ పెడ్లర్లు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.

బైక్‌ నుంచి బస్సు వరకు

హైదరాబాద్‌ వంటి నగరాల్లో బ్లాక్‌ మార్కెట్‌లో గంజాయికి ఫుల్‌ డిమాండ్‌ ఉంది. గంజాయిని ఎండబెట్టి, ప్యాకెట్లుగా చేసి తొలి దశలో ఉండే పెడ్లర్‌ చేతికి వచ్చే సరికి కేజీ ప్యాకెట్‌ ధర రూ.25వేలుగా ఉంటోంది. ఇది హైదరాబాద్‌కు చేరాక కేజీ విలువ రూ.లక్ష వరకు పలుకుతోంది. దీంతో వ్యక్తులు, వ్యవస్థీకృత నేర ముఠాలు గంజాయి రవాణాలో భాగస్వాములుగా ఉంటున్నారు. బైక్‌లు, ఆటో, కారు, ట్రాక్టర్‌, లారీ, బస్సులు ఇలా వివిధ వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఇందుకోసం వాహనాలకు ప్రత్యేకంగా డిజైన్లు కూడా చేయిస్తున్నారు.

ఉక్కుపాదం మోపాలి

జిల్లాకు సరిహద్దులో ఉన్న దండకారణ్యం 40 ఏళ్ల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరొందింది. అయితే ఆ ప్రభావం చర్ల, దుమ్ముగూడెం మండలాలను దాటి రాకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. గంజాయి విషయానికి వస్తే పోలీసు, ఎకై ్సజ్‌ విభాగాలు అక్రమ రవాణాను అడ్డుకునేందుకే పరిమితం అవుతున్నాయి. అందుకు స్థానికంగా సహకరిస్తున్న వ్యక్తులు/ ముఠాల భరతం పట్టడం లేదు. మావోయిస్టు పార్టీకి అడ్డుకట్ట వేసినట్టుగానే గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

ఈ ఏడాది ఎకై ్సజ్‌ స్టేషన్ల వారీగా పట్టుబడిన గంజాయి వివరాలు

కేసులు గంజాయి విలువ అరైస్టెన వారు

(కేజీల్లో) (రూ.లక్షల్లో)

పాల్వంచ 14 991 495 57

భద్రాచలం 8 42 33 24

మణుగూరు 3 82 41 9

ఇల్లెందు 4 31 15 11

కొత్తగూడెం(2025) 30 3,372 843 141

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తోంది. గతేడాది వివరాలను పరి శీలిస్తే 112 కేసులు నమో దు కాగా, 8,078 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.20.20 కోట్లుగా నమోదైంది. 399 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఈ నెల 5 వరకు వివరాలను పరిశీలిస్తే కొత్తగూడెం ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగి లిన నాలుగు ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్లలో 29 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,146 కేజీల గంజాయి పట్టుబడగా, దాని విలువ సుమారు రూ. 2.86 కోట్లుగా తేలింది. ఇలా పట్టుబడిన గంజాయిని పెద్ద మొత్తంలో పోగుపడిన తర్వాత ఎకై ్సజ్‌ అధికారులు కాల్చి వేస్తున్నారు.

ఏఓబీ నుంచి జిల్లా మీదుగా

అక్రమంగా రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement