దమ్మపేట: విద్యార్థుల్లో జ్ఞాపక, ఆలోచన శక్తులు, పోటీ తత్వాన్ని పెంపొందిచేందుకు క్విజ్ పోటీలు దోహదం చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంకంపాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల స్థాయి క్విజ్ పోటీలను పీఓ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి నలుగురిని ఎంపిక చేసి, ఈ నెల 11న ఏటీడీఓ స్థాయిలో, 13న ఐటీడీఏ స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మురళి, ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్‌ఎం శారద, డిప్యూటీ వార్డెన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
భద్రాచలం: గిరిజన ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధికారుల సమన్వయంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీల సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అధికారులు చందన, అరుణకుమారి, మధుకర్, సమ్మయ్య, వేణు, రమేష్, విజయ్ కుమార్, ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఆహ్వానం
భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి రావాలని ఏపీఓ డేవిడ్‌రాజ్ శుక్రవారం కలెక్టర్ అంకిత్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


